ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార  దాడుల ఘటనలు  రోజురోజుకు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇలా మహిళలపై దాడులు ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూ సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. కామంతో  ఊగిపోయిన ఎంతోమంది మృగాలు ఆడపిల్లలు  కనిపిస్తేచాలు అత్యాచారాలకు పాల్పడటం  లేదా దాడులకు పాల్పడడం ఇలాంటి ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.  ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే.



 ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో వెలుగులోకి వచ్చిన అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటన మరవకముందే ఎంతో మంది మహిళలపై అత్యాచారం జరిగిన ఘటనలో కూడా ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం కూడా మహిళలందరికీ రక్షణ కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ చర్యలు చేపడుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఉత్తరప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. మహిళలందరూ స్వీయ రక్షణ కోసం కత్తులు  దగ్గర పెట్టుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.



 ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు  దాడుల ఘటనలు  పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళలందరూ ఆత్మరక్షణ కోసం తమ వద్ద కత్తి  ఉంచుకోవాలని ఉత్తరప్రదేశ్ మంత్రి మనోహర్ లాల్  సూచించారు. ఆత్మరక్షణ కోసం అవసరమైనప్పుడు ఆ కత్తులను వాడాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఎప్పుడూ మీ దగ్గర ఒక కత్తి ఉంచుకోండి.. అవసరమైనప్పుడు ఆ కత్తిని వాడండి ఇక ఆ తర్వాత భగవంతుడు అంతా చూసుకుంటాడు అంటూ మంత్రి మనోహర్ లాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 1857 కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళతో ఎంతో వీరోచితంగా పోరాడిందని మహిళ అబల కాదు సబల అని గుర్తు చేశారు యూపీ మంత్రి మనోహర్ లాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: