కల్వకుంట్ల కవిత కెసిఆర్ కుమార్తె గానే కాకుండా, తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపును సాధించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఢిల్లీ స్థాయిలో టిఆర్ఎస్ తరఫున లాబీయింగ్ చేశారు. ఒకవైపు తన తండ్రి కెసిఆర్ సీఎంగా ఉండటం, సోదరుడు కేటీఆర్ మంత్రిగా ఉండడం, ఇలా ఎన్నో రకాల సమీకరణాలు ఆమెకు కలిసి వచ్చాయి. ఇక రెండోసారి నిజామాబాద్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేసినా, ఊహించని విధంగా ఓటమి పలకరించింది. దీంతో నిరాశ నిస్పృహలకు గురి అయిన ఆమె, రాజకీయ అజ్ఞాతవాసం గడిపారు.


 కానీ కేసీఆర్ నిజామాబాద్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవితకు టికెట్ ఇవ్వడం, అఖండ మెజారిటీతో గెలుపొందడం వంటివి జరిగాయి. తాజాగా, కెసిఆర్
జాతీయ స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండటంతో, కవితను మంత్రిగా నియమించి, టిఆర్ఎస్ లో మరింత యాక్టివ్ చేస్తారని, ఆమెకు కీలకమైన మంథి పదవి కేటాయించి తగిన ప్రాధాన్యత కల్పిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ ఆమెను క్యాబినెట్ లో తీసుకునే ఆలోచనలో కెసిఆర్ లేరట.


 దీనికి కారణం ఇప్పటికీ 17 మంది మంత్రులు కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నారు. కవితను మంత్రిగా నియమించాలి అంటే ఎవరో ఒకరితో తప్పనిసరిగా రాజీనామా చేయించాలి. కానీ ఎవరితోనూ రాజీనామా చేయించే ఆలోచనలో కెసిఆర్ లేరు. దీనికి కారణం అనవసర విమర్శలు వస్తాయి అనేది కేసీఆర్ అభిప్రాయమాట. ఆ కారణంతోనే ఆమెకు మంత్రిగా అవకాశం కల్పించేందుకు కేసీఆర్ ఇష్ట పడటం లేదట. కాకపోతే మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆమె హోదాకు తగిన విధంగా క్యాబినెట్ స్థాయి పదవి అయినా ఇచ్చే లోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా టీఆర్ఎస్ లో వినిపిస్తున్న గుసగుసలు. మరికొద్ది రోజుల్లోనే కేటీఆర్ సీఎం కుర్చిలో కూర్చునే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుండగానే కవితకు మంత్రిపదవి ఇచ్చేది లేదు అనే వార్తలు వస్తుండడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: