కరోనా వైరస్ చైనా నుండి అలా భారత దేశంలో అడుగు పెట్టిందో లేదో ప్రజల ఆలోచన విధానాలతో పాటు పాలనా విధానంలోనూ... దేశంలో నిత్యం జరిగే ఎన్నో విధానాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. లాక్ డౌన్ ఉండడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు... రవాణా వ్యవస్థపై పూర్తి ఆంక్షలు విధించి నిలిపివేసింది  ప్రభుత్వం... ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా భయం వీడి యధావిధిగా రోడ్లపైకి వస్తున్నారు.... అటు కేంద్రం కూడా అన్ లాక్ డౌన్ పేరిట దశలవారీగా ఒక్కో రంగానికి తిరిగి పునఃప్రారంభించడానికి అనుమతిస్తుంది... కానీ కోవిడ్-19 నిబంధనలు మాత్రం తప్పనిసరి అంటూ హెచ్చరిస్తూ ప్రజలను పరిమితం చేస్తోంది.

అయితే ఇప్పుడు...తాజాగా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది... మొదట రోడ్డు  రవాణా వ్యవస్థకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు విదేశాల నుండి విమాన రాకపోకలకు అనుమతిని ఇవ్వనున్నట్లు పేర్కొంది కేంద్రం. విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కానీ ప్రయాణికులు మాత్రం ఆరోగ్యశాఖ సూచించిన ప్రకారం.... కరోనాకు సంబంధించిన అన్ని నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. క్వారంటైన్ తదితర కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారత మూలాలున్న భారతీయులతోపాటు విదేశీయులు ఎవరైనా వాయు జల మార్గాల ద్వారా భారత్ కు వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతులు జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రావచ్చు.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లవచ్చని ప్రయాణికులకు శుభవార్త ను అందించింది కేంద్రం. అంతేకాదు ప్రస్తుతం ఉన్న వీసాలన్నింటిని యాక్టివ్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ పర్యాటక వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర అన్ని వీసాలను కేంద్రం పునరుద్ధరించింది.భారత్ లో చికిత్స కోసం మెడికల్ వీసాలను కేంద్ర హోంశాఖ మంజూరు  చేయబోతుండటం విశేషం... ఎటు తిరిగి మళ్లీ మన విమానాలు గాలిలో చక్కర్లు కొట్టిన డానికి సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: