సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ చాలా వరకు కూడా దూకుడుగా వెళుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఇచ్చి అమలు చేసిన పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రధానంగా కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ప్రజల్లో మద్దతు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక సంక్షేమ కార్యక్రమం విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది.

జగనన్న విద్య వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేసే విధంగా అడుగులు వేస్తుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక మంత్రులు కొందరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అక్కడున్న డిగ్రీ చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా ముఖ్యమంత్రి  జగన్ తో చర్చించారు అని అంటున్నారు. సీఎం జగన్ కూడా దీనికి సంబంధించిన కొన్ని సూచనలు ఆయనకు చేసినట్లుగా సమాచారం.

త్వరలోనే దీనికి సంబంధించి కీలక అడుగు పడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి తర్వాత నుంచి అమలు చేసే విధంగా అక్కడి రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే కర్ణాటక మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్ వచ్చి సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారుల బృందం కూడా అక్కడికి వెళ్లి అక్కడి ప్రభుత్వానికి దీనికి సంబంధించిన సలహాలు ఇవ్వటమే కాకుండా కార్యక్రమం అమలుకు సంబంధించి కూడా పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: