ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పనితీరు విషయంలో సీఎం జగన్ సంతృప్తిగా లేరు అనే వ్యాఖ్యలు కొంతకాలంగా వింటూనే ఉన్నాం. ప్రధానంగా కొంతమంది మంత్రులు ఆయనకు ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందించడం లేదని సీఎం జగన్ సీరియస్ గానే ఉన్నారు. ఆర్ధికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న సరే ఆదాయం వచ్చే శాఖల్లో ఉన్న మంత్రులు కూడా దృష్టి పెట్టడం లేదని సీనియర్ మంత్రులు కూడా పెద్దగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మీద ఫోకస్ పెట్టడం లేదని జగన్ సీరియస్ గా ఉన్నారు.

దీని ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుంది అని... మంత్రులు ఆశించిన స్థాయిలో పని చేయకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రుల శాఖలను మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ఒక కీలక శాఖకు చెందిన మంత్రిని ఇప్పటికే మార్చడానికి రంగం సిద్ధం చేశారు. అవసరమైతే ఆయన స్థానంలో కొత్త మంత్రులను తీసుకుని ఆయనకు మరో శాఖ అప్పగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రుల విషయంలో సీఎం జగన్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇద్దరికీ ఆదాయం వచ్చే శాఖకు అప్పగించిన పని తీరు విషయంలో దృష్టి పెట్టకుండా వ్యక్తిగత వ్యవహారాలు ఎక్కువగా చూస్తున్నారని, సొంత నియోజకవర్గంలో పెత్తనాలు ఎక్కువగా చేస్తున్నారని సీఎం జగన్ కాస్త సీరియస్గా ఉన్నారు. దీంతో వారి వారి శాఖను తప్పించి ప్రతిభ ఉన్న వారికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే శాసన మండలి రద్దు ఇప్పట్లో కాదు కాబట్టి ఆ ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్ లోకి తీసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: