బెడిసికొట్టిన సోము వ్యూహం అడ్డంగా బుక్కయ్యారుగా..??

బెజేపి సోము వీరాజు...ఈయన వచ్చి రాగానే ఎంత పెద్దగ దూకుడుగా ముందుకు వెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...సాదారణంగా కొట్టగా పదవి వచ్చినప్పుడు అందరు ఎదో చేయాలనీ ముందుకు దూకుడుగా వెళ్ళడం సర్వ సదారణమే...అయితే  నేడు సోము వీరాజ్ చేసిన వాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయ్....రాష్ట అదేక్షుడుగా సోము చెలరేగిపోవడం...ఏకంగా ycp జగన్ సర్కార్ ను సైతం టార్గెట్ చేస్తూ సంచలన వాఖ్యలు చేసారు...?? ఈ సందర్బంలోనే సోము అడ్డంగా ఇరుకున్నారు కూడా...ఇంతలో సోము ఏమ్మన్నారు,,అయన విసిరినా బంతిలో ఆయనే ఎలా పడ్డారో ఇప్పుడు చూడం రండి....


ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించడంలో, కేంద్రం నుంచి వస్తోన్న నిధుల్ని మింగేయడంలో, అవినీతి, అక్రమాల వ్యవహారాల్లోనూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, ఏపి సియం జగన్ కవలపిల్లలని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు.....ఆ  నాటి టీడీపీ వైఫల్యాలను, ప్రస్తుత వైసీపీ తప్పులను ఏకిపారేస్తామని, ఇద్దరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన బీజేపీకి అసలు  లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.....అయితే  విజయవాడ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు..... టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు...


అమరావతే రాజధాని.. ప్రస్తావన గురించి మాట్లాడుతూ,,,,ఏపీ రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలకంటే ఎక్కువ క్లారిటీ బీజేపీకి ఉందని, అమరావతి మాత్రమే ఆంధ్రుల రాజధానిగా ఉండాలని సోము వీర్రాజు చెప్పారు..... అమరావతిని రాజధానిగా ఫిక్స్ అయ్యాం కాబట్టే విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయం పెట్టామని, త్వరలోనే శాశ్వత భవంతిని కూడా నిర్మిస్తామని తెలిపారు.... రాజధాని పై నాటు టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు రైతుల్ని దారుణంగా మోసం చేశాయని ఆయన ఆరోపించారు. అది ఎలా అంటే..టీడీపీ, వైసీపీ కులపార్టీలు కాకున్నా.. ‘‘రాజధాని తరలింపు, అనేక ఇతర వివాదాల నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు కులాల పరంగా విమర్శలు చేసుకుంటున్నాయి. వాటిని కుల పార్టీలుగా బీజేపీ చూడబోదు. కానీ ఆ రెండూ కచ్చితంగా కుటుంబ పార్టీలే. జాతీయ భావాలు కలిగిన పార్టీగా మేం ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగబోనివ్వం. జనసేన పార్టీతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా పోరాటం చేస్తాం''అని వీర్రాజు అన్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత 21 పథకాలు అమలవుతున్నాయని, వాటికి సంబంధించి స్థానిక ప్రభుత్వాలు చేసిన అవినీతి అక్రమాల చిట్టాను రూపొందించి, ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నామని, ఇటీవల వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిని అడిగిన వెంటనే నష్టం అచనాల కోసం బృందాలను పంపేందుకు అగీకరించారని సోము తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: