రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎంతో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.. ఓ వైపు కరోనా ఇంతలా విజృంభిస్తున్న ఆయనకు ఎందుకు స్పృహ ఉండట్లేదు అని అధికార పార్టీ వైసీపీ అంటుంటే విపక్షాలు మాత్రం నిమ్మగడ్డ కు సపోర్ట్ చేస్తున్నాయి. టీడీపీ నిమ్మగడ్డ తన అంటే తందానా అంటూ వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది.. ఒకప్పుడు కరోనా ఉందని వాయిదా వేసిన నిమ్మగడ్డ అదే కరోనా వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం పెద్ద వివాదమవుతుంది. మరికొన్ని రోజుల్లో అయన పదవీ కాలం ముగియనుండటంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీ గెలవనీయకుండా చేయాలన్నది అయన ఆలోచన..

అయితే ఎన్నికల నిర్వహణ అంటే మాములు మాటల.. అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ఏ ఎన్నికల కమిషనర్ ఎలక్షన్స్ ని నిర్వహించలేదు. వాస్తవానికి వైసీపీ కి ఇప్పుడు గడ్డుకాలం నెడుతుంది.. ప్రజల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుంది.. అందుకు జగన్ కొన్ని పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల్లో వైతిరేకత ను లేకుండా చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళదామని ఆలోచనా.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు కోసం ఎంత మాత్రం కూడా సిద్ధంగా లేదని అర్థమవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేసినా సరే ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్వహించే సమస్యే లేదని స్పష్టం చేస్తుంది.

ఇన్నిరోజులు నిమ్మగడ్డ కు టీడీపీ సపోర్ట్ ఒక్కటే ఉందని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ కూడా దొరికింది. ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేయగ బీజేపీ, జనసేనలు ఓ స్టెప్ ముందుకేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని, ఎప్పుడైనా సరే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ నేతలతో కలుపుకుని ముందుకు వెళ్ళాలి అని ఆయన కొన్ని సూచనలు చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో నాయకులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: