అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదు ఇది వైసీపీ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి అన్న మాటలు.. వీరి మధ్య  వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో అందరికి తెలిసిందే.. రాష్ట్రంలో కరోనా లేని సమయంలో అదో సాకుగా చేసుకుని నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయడం వైసీపీ కి నచ్చలేదు.. పోనీ ఇప్పుడు పెడదామా అంటే వైసీపీ అస్సలే వద్దంటుంది. ఇందుకు కారణాలు ఏవైనా నిమ్మగడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదోకటి చేయాలనే ఆశ ఎక్కువైంది.

చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న నిమ్మగడ్డ కు వైసీపీ అధికారంలోకి రావడమే ఎందుకో నచ్చలేదు.. అందుకే ఎన్నికల నిర్వహణ విషయంలో, తనను పదవి నుంచి తీసేసిన విషయంలో కోర్టు కు కూడా వెళ్లారు.. ఆ తర్వాత కోర్టులు కేసులు అని ఆరునెలలు తిరిగిన తర్వాత కానీ ఆయనకు బుద్ధి రాలేదు.. ఎలాగో తన పదవిని తాను పొందిన కూడా ప్రభుత్వానికి ఎప్పుడు అయన సహకరించడం లేదు.. ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రజల శ్రేయస్సు చూడాల్సింది పోయి ఓ పార్టీ కి అండగా అయన పనిచేయడం మూలానా, ఇప్పుడు ఆ పార్టీ నేతలు, అయన బాగానే ఉన్నా ప్రజలు మాత్రం చాలా ఇబ్బందిపడుతున్నారు..

ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నిర్వహణ విషయంలో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు, ఢిల్లీ లాంటి చోట్ల అయితే థర్డ్ వేవ్ కూడా మొదలైంది. ఇక కేరళలో సెకండ్ వేవ్ గట్టిగా ఉంది. కరోనా మొదట కేరళ నుంచే పాకి దేశమంతా తీవ్రమైంది. ఇపుడు సెకండ్ వేవ్ కూడా అక్కడ ఉదృతంగా ఉంది. దాంతో ఏపీలో కూడా సెకండ్ వేవ్ గట్టిగానే ఉండవచ్చు అంటున్నారు. దాంతో ప్రభుత్వం అసలు ఎన్నికలకు ముందుకు వెళ్ళదు. ఈసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా పేరిట మళ్ళీ వాయిదా వేసుకోవచ్చునని అంటున్నారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో శ్రమించి తన కుర్చీని సాధించారు కానీ అంతే ఛాలెంజిగా ఎన్నికలు నిర్వహించడం అంటే కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించలేకపోతే జనవరిలో పండుగల హడావుడి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి బడ్జెట్ సమావేశాల హడావుడి తో మార్చి వరకూ కధ సాగుతుంది. ఆ మీదట నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం కూడా ముగుస్తుంది. మొత్తం మీద నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించని అధికారిగా రిటైర్ అయిపోతారా అన్నది మాత్రం ఆసక్తికరమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: