వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని చెప్పొచ్చు..అయితే జగన్ ఇంత స్థాయి కి రావడానికి అయన ఒక్కరి కృషి ఉందంటే ఎవరు ఒప్పుకోరు.. ఎందుకంటే అయన గెలవడానికి ముఖ్య కారణం ప్రజలు అయితే ప్రధాన కారణం అయన వెన్నంటి ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలు.. వీరు ఎలాంటి స్వార్ధం లేకుండా జగన్ కోసం, పార్టీ కోసం పనిచేసిన వారే..ఇక ప్రజలు అనుకున్నట్లుగానే జగన్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు. హామీలు నెరవేర్చడంలో, పథకాల అమలులో ఎంతో పారదర్శకత్వ చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసి మరీ అధికారంలోకి వచ్చారు.  ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు..

అయితే మొదటి ఎన్నికల్లో జగన్ గెలవలేకపోయినా రెండు సారి సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.. అయితే రాష్ట్రం విడిపోయి అయోమయంలో ఉన్న ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు తప్పా జగన్ పై అపనమ్మకం కాదు.. లేదంటే అప్పుడే అయన గెలిచి ఉండేవారు.. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇదే సందు అనుకునిచేసిన అవినీతిని ప్రజలు గ్రహించి వెంటనే జగన్ వైపుకు మళ్ళారు..

అయితే ఎన్ని మెట్లు ఎక్కినా జగన్ తనను నమ్మిన వారిని మాత్రం మర్చిపోలేదు.  తన క్యాబినెట్ సహచరుడు, ముఖ్య అనుచరుల్లో ఒకరైన పేర్ని నాని తల్లి మరణించిన తరుణంలో ఆయన మచిలీపట్నం పయనమయ్యారు. మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణంతో శోకంలో ఉన్న ఆయన్ని ఓదార్చారు. తద్వారా తనకు సన్నిహితులైన వారి కోసం సమస్యలున్నప్పటికీ తాను ఎంత దూరమయినా వెళ్లేందుకు తండ్రి బాటను వీడబోనని నిరూపించుకున్నారు.కరోనా కాస్త నిదానించిన తరుణంలో అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూనే బందరు లో అడుగుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: