గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ని సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన నగర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. దేశంలోనే హైదరాబాద్ చారిత్రాత్మక నగరం అని సీఎం కేసీఆర్ అన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు బీహెచ్ఈఎల్ నుంచి మెహదీపట్నం వరకు మెట్రో నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు. పది కోట్ల లోపు ఖర్చుతో తీసే సినిమాలు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు సీఎం కేసీఆర్.

నగరంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లన్ని ఇకనుంచి భూగర్భంలోని ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి హైదరాబాద్ ప్రజలు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నగరంలో రెండోదశలో 125 లింక్ రోడ్లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరానికి చాలా అద్భుతంగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. జంటనగరాల్లో మంచినీటి సమస్య లేదని ఆయన అన్నారు. మిషన్ భగీరథతో నీటి సమస్యలు తొలగిపోయాయి అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

వచ్చే నెల నుంచి రాష్ట్రంలో సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బస్తీలోని ప్రభుత్వ మోడల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద నీటి కోసం 12 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని అన్నారు. గోదావరి నది తో మూసి నది అనుసంధానం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైళ్లను పెంచుతామని చెప్పుకొచ్చారు.

ఔటర్ రింగ్ రోడ్డు కి అవతల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. మహానగరానికి 13 వేల కోట్లతో సముద్ర సివరేజీ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల దోబీ ఘాట్ కు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన వివరించారు. అన్ని రకాల సినిమాల థియేటర్లకు షో లు పెంచుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. వాటర్ ట్యాంకర్ల దగ్గరయుద్దాలు  చూశామని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: