గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కువగా టార్గెట్ చేసింది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీలో అసహనంగా వున్న కొంతమంది నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేతలు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు అని  రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలను బయటకు తీసుకురావడానికి ఎక్కువగా కష్టపడుతున్నారని సమాచారం.

టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అసహనంగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. వరద బాధితులకు సహాయం చేసే విషయంలో కొంతమంది నేతలు ఎక్కువగా పెత్తనం చేశారని సమాచారం. దీని వలన తాము ఇబ్బంది పడ్డాము అని కొంతమంది నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన సరే ఫలితం లేదు అనే భావన కొందరిలో వ్యక్తమైంది. దీంతో ఇప్పుడు కొంతమంది బయటకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఎవరు బయటకు వస్తారు ఏంటి అనేది తెలియక పోయినా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అసహనంగానే ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు కూడా బయటకు రావడానికి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని త్వరలోనే వారందరూ కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు బయటకు రావడానికి ఆసక్తి గా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఎవరు బయటకు వస్తారు ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: