ఒకప్పుడు భారత్ డిఫెన్సివ్ వ్యూహంతో ముందుకు సాగేది అనే విషయం తెలిసిందే. పాకిస్తాన్ సరిహద్దు లో ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్ సైనికులు భారత సైన్యంపై దాడి చేసిన సమయంలో.. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పడం ఆ తర్వాత వారి నుంచి ఆ దేశాలు వచ్చేంత వరకూ ఆగడం... లేదా పాకిస్తాన్ సైన్యాన్ని ఉగ్రవాదులను నిలువరించడం లాంటిది  చేసేది. కానీ ప్రస్తుతం డిఫెన్సివ్ కాదు అఫెన్సివ్  వ్యూహంతో ముందుకు సాగుతుంది భారత ఆర్మీ. పాకిస్తాన్ సైనికులు భారత సైనికుల పై దాడి చేస్తే నిలువరించడం కాదు.. ఏకంగా ముందుగా భారత ఆర్మీ పాకిస్తాన్ పై దాడి చేస్తూ దూసుకుపోతున్నది.



 సరిహద్దులు పాకిస్తాన్ సైనికులు ఏమాత్రం తోక జోడించిన తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతుంది అనే విషయం తెలిసిందే. ఉగ్రవాదులను అయితే ఎక్కడికక్కడ మట్టు  పెడుతూ విరుచుకు పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి  వరకు భారత ఆర్మీ కేవలం గన్స్ కి మాత్రమే పని చెప్పేది కానీ ఇటీవల కాలంలో ఏకంగా మిస్సైల్స్  కి కూడా పని చెప్పడం మొదలు పెట్టింది భారత్ . ఇక ఈ క్రమంలోనే పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ వరుసగా దాడి చేస్తూనే ఉంది భారత ఆర్మీ.




 ఈ క్రమంలోనే రోజుకు కనీసం 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్ దాడిలో చనిపోతున్నట్లు ఇటీవలే భారత రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి నుంచే కాదు ఎన్నో రోజుల నుంచి భారత సరిహద్దుల్లో కి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టు పెడుతూనే ఉంది భారత్. దాదాపుగా ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టగా  ఇక ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో తలదాచుకున్న ఎంతోమంది ఉగ్రవాదులను గుర్తించి మిస్సైల్స్ ప్రయోగించి మరి మట్టు  పెడుతుంది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: