తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు ఈ మధ్య కాలంలో బయటకు రావాలనే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు బయటకు వస్తారు ఏంటనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా దీనికి సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి బలపడే అవకాశాలు కూడా లేవు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొంతమంది ఇప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు.

ప్రధానంగా అగ్ర నేతలు కొంతమంది ఇతర పార్టీ లోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడు భయపడుతుంది అనే చెప్పాలి. వైసీపీ నేతలు బలంగా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో దూకుడుగా వెళుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివలన క్యాడర్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఉన్న నేతలు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇప్పుడు వైసిపి దూకుడుగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నలుగురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారందరూ కూడా పార్టీ మారడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: