గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పరిధిలో ఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపుగా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు బస్తీ ప్రాంతవాసులు ఎటువైపు ఆసక్తి చూపిస్తారు ఏంటి అనేది సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. బస్తీ ప్రాంతాలకు సీఎం కేసీఆర్ అనేక వరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఈ ప్రాంతవాసులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. బస్తీ ప్రాంతంలో పెద్దయెత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టారు.

అయితే వరదలు వచ్చిన సమయంలో బస్తీ ప్రాంతవాసులు బాగా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. కాబట్టి వాళ్లకు ఎంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది ఏంటి అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. వాళ్ళకి కొన్ని వరాలు ప్రకటించిన సరే వారికి పూర్తిస్థాయిలో సాయం అందిన పరిస్థితి కూడా లేదు. వరద సహాయం బస్తీ ప్రాంతవాసులకు పెద్ద ఎత్తున సహాయం అందలేదు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ ఎన్నికల్లో బస్తీ ప్రాంతవాసులు ఎవరి వైపు ఆసక్తి చూపిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశం లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నాయి. మరికొంతమంది బీజేపీని నమ్మే అవకాశం లేదని బస్తీ ప్రాంతాల్లో ఉండే ఎక్కువగా ముస్లిం వర్గాలు బీజేపీ విషయంలో కాస్త ఆందోళన కరంగా ఉన్నాయి. కాబట్టి ఇది టీఆర్ఎస్ పార్టీకి లాభించే అవకాశం ఉందని అంటున్నారు. వరద సమయంలో కష్టాలు పడిన సరే బిజెపి వస్తే తాము ఇబ్బందులు పడతామనే భావనలో ఉన్న ముస్లింలు బిజెపికి ఓటు వేసే అవకాశం లేకపోవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉండే వారిలో రోజువారి కూలీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు ఎంత వరకు ఓటు వేస్తారు ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: