రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రిగా ఎవరు ఎంపికవుతారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర మంత్రి పదవి పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కీలక నేతలను క్యాబినెట్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ లోకి యువతను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్ ని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి ధర్మపురి అరవింద్ ని కచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే చర్చలు జరుగుతున్నాయి. ధర్మపురి అరవింద్ కి ఇప్పటికే బీజేపీ పెద్దలు సమాచారం కూడా పంపించారు అని అంటున్నారు. దీంతో ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనబడుతుంది.

కిషన్ రెడ్డిని కూడా శాఖ మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తోపాటుగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టాయి. దీనితో ఆయన క్యాబినెట్ మార్చే అవకాశాలు ఉన్నాయి అని వ్యాఖ్యలు కనపడుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన కొన్ని కొన్ని విషయాల్లో విమర్శలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను ఒక ఆటాడుకున్నారు అనే భావన కూడా చాలామందిలో ఉంది. కాబట్టి బిజెపి కూడా ఆయన విషయంలో అసహనం గానే ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: