ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. అయితే అధికార పక్షానికి ఎక్కువ బలం ఉండటంతో ప్రతిపక్ష టీడీపీ సభలో తేలిపోతుంది. పైగా టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే జంప్ అయిపోయారు. ఇక మిగిలిన 19 మందిలో అయిదారుగురు సభకు హాజరు కావడం లేదు.

పైగా వచ్చిన వారిలో చంద్రబాబుకు మద్ధతుగా ఉంటూ, వైసీపీ మీద పోరాడే నాయకులు కరువైపోయారు. అయితే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే టీడీపీలో మరికొందరు జంపింగ్‌కు సిద్ధమైపోయారని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ఎలాగో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన అసెంబ్లీ మోహమే చూడటం లేదు. ఎప్పటి నుంచి గంటా టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైతం అసెంబ్లీలో గానీ, టీడీపీలో గానీ పెద్ద యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు.

తాజాగా అసెంబ్లీలో పెద్ద రాద్ధాంతం జరిగిన కూడా గణబాబు, గంటాలు స్పందించలేదు. ఇటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సమావేశాలకు దూరంగానే ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామిలు చంద్రబాబుకు సపోర్ట్‌గా నిలిచారు గానీ, గొట్టిపాటి మాత్రం అడ్రెస్ లేరు. ఇక టీడీపీలో మరో ఎమ్మెల్యేపై కూడా డౌట్ వస్తుంది.

తాజాగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అసెంబ్లీలోమాట్లాడుతూ, ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఆక్వా రంగం గురించి చెబుతూ, ప్రభుత్వం బాగానే పనిచేస్తుందనే చెప్పారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆక్వా రైతులని ఆదుకోవడానికి ప్రయత్నించిందనే చెప్పారు. ఇక ఈయన మాటల బట్టి చూస్తే, టీడీపీకి షాక్ ఇచ్చేలాగానే ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏ ఎమ్మెల్యే టీడీపీని వీడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: