ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే చంద్రబాబు నాయుడు రాజకీయంగా నిలబడటం అనేది చాలా వరకు కష్టమే. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఫోకస్ చేస్తుంది కాబట్టి త్వరలోనే ఆ పార్టీలో నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఏపీలో ఎమ్మెల్యేలు మీద బిజెపి ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. కానీ ప్రతిపక్షంలో మేమున్నామని పదేపదే చెబుతూ వస్తోంది. అందుకు తగిన విధంగా పార్టీ ఇప్పుడు మార్గం సుగమం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేని విశాఖ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లాగే ఆలోచనలో ఉందని సమాచారం. గంటా శ్రీనివాసరావు విషయంలో ఇప్పటికే బిజెపి నేతలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్లే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయన విషయంలో వైసీపీ కాస్త సీరియస్ గా ఉందని ఆయనను వైసీపీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది చూడాలి అంటే త్వరలోనే ఒక కీలక అడుగు ద్వారా స్పష్టత రానుంది. బిజెపికి చెందిన కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ని కూడా టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలను కూడా బిజెపిలోకి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బిజేపిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: