ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ  కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ ప్రజానీకం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది అన్న విషయం తెలిసిందే. దాదాపు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్ మొదలై ఏడాది కావస్తుంది.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 15 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఈ వైరస్ ను అంతం చేసేందుకు ఎన్నో సంస్థలు టీకాను అభివృద్ధి చేసాయి అన్న విషయం తెలిసిందే.



 మరికొన్ని రోజుల్లో వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన టీకాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రజలందరిలో ధైర్యం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది నిపుణులు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా వైరస్ తగ్గుతుంది అన్నది మాత్రం అవాస్తవం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ రాగానే పోదని దశాబ్దాల పాటు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ వల్ల మాయమైపోతుంది అనుకుంటే అది వారి పిచ్చితనమే అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. వ్యాక్సిన్  కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిబద్ధతతో శ్రమించారు అంటూ చెప్పుకొచ్చారు.



 మరి కొన్ని వారాల్లో వ్యాక్సిన్  అందుబాటులోకి రానుందని తెలిపారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ఎన్నడూ లేనంతగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కరోనా వైరస్ గాడిలో పెట్టడానికి ఎంతో  సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వ్యాక్సిన్  వచ్చినప్పటికీ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని... పరీక్షలు నిర్వహించడంతో పాటు.. వైరస్ బారిన పడిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని అంతేకాకుండా భౌతిక దూరం పాటించి.. తగిన జాగ్రత్తలు పాటిస్తే నే కరోనా వైరస్ క్రమక్రమంగా నియంత్రించబడుతుంది అలా జరగకపోతే వ్యాక్సిన్ వచ్చిన ఉపయోగం లేదు అంటూ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: