వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు కొంతమంది జగన్ వెంట నడుస్తుండగా , మరికొంతమంది జగన్ ను రాజకీయ శత్రువుగా చూస్తూ, తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా జగన్ పై ఫోకస్ పెంచి విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లోనే ఉండిపోయిన చాలా మంది సీనియర్ నాయకులు ఈ విమర్శలు చేయడంలో ముందు ఉంటున్నారు. అయితే వీరంతా వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీర విధేయులుగా మాత్రమే కాకుండా , కీలక మైన పదవులు నిర్వహించిన వారు. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు శైలజానాథ్ వంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీరు జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
దేశంలో అత్యంత బలహీనమైన సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది
జగన్ మాత్రమేనని శైలజానాథ్ వంటి వారు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
జగన్ కు
మోదీ ప్రభుత్వం అంటే భయం అని అందుకే రైతులను ఇబ్బంది పెట్టే వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు మద్దతుగా నిలిచారని
రాజశేఖర్ రెడ్డి ఆశయాలను
జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. ఇక మొదట్లో
జగన్ కు మద్దతుగా వ్యవహరిస్తూ వచ్చిన
ఉండవల్లి అరుణ్
కుమార్ ఇప్పుడు
జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇలా చాలామంది నాయకులు ఇప్పుడు
వైసీపీ లో ఉన్నారు.
వారిలో శైలజానాథ్ వంటివారు ఉన్నారు. శైలజానాథ్ , రఘువీరా
రెడ్డి ఇంకా అనేకమంది మొదట్లో
వైసీపీ లోకి వచ్చేందుకు ప్రయత్నించినా,
జగన్ ఆసక్తి చూపించకపోవడం వంటివి జరిగాయి దీనికి కారణం సామాజిక వర్గాల సమీకరణాలు తేడా రావడం, అయా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు వంటివి ఎన్నో లెక్కలు వేసుకుని
జగన్ రాజశేఖర్ రెడ్డి అనుచరులు చాలామంది నే దూరంగానే ఉంచారు. అలా దూరం పెట్టిన తీరే వారికి మంట పుట్టిస్తోంది.