సరే! ఇప్పుడు విషయం ఏంటంటే.. మరో ఏడాదిలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంది. ఇప్పుడున్న మంత్రులను సమూలంగా మార్చడమా.. లేక సగం మందిని పక్కన పెట్టడమా..? అనే విషయంపై జగన్ పరిశీలన చేస్తున్నారని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మంత్రి వర్గంలో ముగ్గురికి మాత్రమే చోటు కల్పించిన జగన్ తన రెండో దఫా కూటమిలో ఐదుగురు వరకు మంత్రులను కేటాయించాలని అనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడున్న వారిని కొనసాగిస్తూనే.. లేదా ఒకరిద్దరును మార్చి.. మరో ముగ్గురిని తీసుకోవడమా? అనే చర్చ సాగుతోంది. ఈక్రమంలో శ్రీకాకుళం నుంచి రెడ్డి శాంతికి బెర్త్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు.
ఇక, ఈ జాబితాలో అనంతపురం నుంచి ఇద్దరు ఉన్నా.. ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. మరీ ముఖ్యంగా విద్యావంతురాలు.. ఉషశ్రీచరణ్‌కు అవకాశం ఇవ్వాలని జగన్ ప్రతిపాదించారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఆమెకు ఈ ఛాన్స్ మిస్సయిందని మరో వర్గం చెబుతోంది. ఇటీవల కాలంలో ఉషశ్రీచరణ్ వివాదాలకు కేంద్రంగా మారారని.. అనంతపురం ఎంపీపై ఒంటికాలిపై లేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి పీక్ స్టేజా అన్నట్టుగా తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటనలో ఉషశ్రీ అనుచరులు మంత్రి కాన్వాయ్‌కు అడ్డుతగలడం.. వంటి పరిణామాలతో జగన్ సీరియస్ అయినట్టు చర్చ నడుస్తోంది.
పైగా నియోజకవర్గానికి కూడా ఆమె కడు దూరంగా ఉండడం... పార్టీ నేతలను పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం వంటివి మైనస్‌గా మారాయి. ఇక అనంతపురం ఎంపీ రంగయ్యతోనూ ఆమెకు గొడవలు ముదురుతున్నాయి. ఆమె బెంగళూరులో ఉండంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్‌లో ఆమెపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ క్రమంలో మంత్రి పదవికి ఆమెను పరిశీలించినప్పటికీ.. పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి