అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శృంగారాన్ని ఎవరు కూడా ఆస్వాదించలేక పోతున్నారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత చాలా జంటలు కొన్ని రోజుల వరకు శృంగారాన్ని ఆస్వాదించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆసక్తి కోల్పోయి పదేపదే కలిసేందుకు ఇష్టపడటం లేదు దీంతో భార్యా భర్తల మధ్య కలయిక అనేది గగనం గా మారి పోతుంది. దాంపత్య జీవితం గడిచేకొద్దీ శృంగారం అనేది బోర్ అని ఫీల్ అవుతూ ఉంటారు కొంత మంది భార్యా భర్తలు.
అయితే ఇలా పడక సుఖానికి దూరంగా ఉండటం మాత్రం ఆరోగ్యానికి హానికరం అన్నది నిపుణులు సూచిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం పడక గది లో భార్య భర్త ల కలయిక నిత్య అవసరం అని.. ఇది కేవలం ఒక శారీరక సుఖం గా మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించే ఉత్సాహాన్ని పెంచే ఒక ఔషధం గా కూడా భావించాలని సూచిస్తున్నారు. శృంగారం లో పాల్గొనడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం తో పాటు రక్తపోటు తగ్గుతుందని గుండెజబ్బుల నుండి కూడా కాపాడుతుందట. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శృంగారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లోఈ విషయాలు వెల్లడయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి