ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇక మరో యువతిని లైంగికంగా వేధించారు అంతేకాదు అనంతరం వారిని ఒక సీక్రెట్ ప్లేస్ లో కూడా బంధించి మరింత హింసించారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణే లో వెలుగులోకి వచ్చింది. దుర్మార్గుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో 16 ఏళ్ల యువతి ఫ్రెండ్స్ కొందరు ఆమెను ఆమె చెల్లెల్ని జనరల్ గా కలిసేందుకు బయటకు రావాలని కోరారు. దీంతో ఫ్రెండ్స్ ని కలవడానికిఇద్దరు బాలికలు బయటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ ఇద్దరిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లారు అబ్బాయిలు.
ఈ క్రమంలోనే అక్కడ యువతిపై అత్యాచారం చేశారు ఇక చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తెల్లవారే వరకు కూడా వారిద్దరిని ఒక సీక్రెట్ రూమ్ లో బంధించారు. ఆ తర్వాత నిందితుల నుంచి తప్పించుకున్న ఇద్దరు యువతులు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిఐదుగురు నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. కాగా ప్రస్తుతం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి