అయితే ఈ విషయంలో ఎస్బీఐ సరికొత్త సంస్కరణలు అమలులో పెట్టింది. బ్యాంకు ఏటీఎంల స్థానంలో బ్రౌన్ లేబుల్ ఏటీఎంలను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. అంటే ఏటీఎంల నిర్వహణను పూర్తిగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించడం అనమాట. ఇకపై ఎస్బీఐ నేరుగా ఏటీఎంలను నిర్వహించదు, ఆ వ్యవహారం మొత్తం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ చూసుకుంటుంది. ఇలా దేశవ్యాప్తంగా ఎస్బీఐ తరపున 3వేల బ్రౌన్ లేబుల్ ఏటీఎంలను సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ అనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తీసుకురాబోతోంది. భవిష్యత్ లో పూర్తి స్థాయిలో ఏటీఎంల నిర్వహణ నుంచి ఎస్బీఐ తప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
మార్చి నాటికల్లా 3వేల ఏటీఎంలను ఎస్బీఐ కోసం సిద్ధం చేస్తున్నట్టు సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ప్రతినిధులు తెలిపారు. అవుట్ సోర్స్ డ్ / బ్రౌన్ లేబుల్ ఏటీఎంలు (బీఎల్ఏ) అంటే బ్యాంకుల తరపున ఏటీఎంల నిర్వహణ సంస్థలు నిర్వహించే ఏటీఎంలు అన్నమాట. చాలా వరకు ఈ ఏటీఎంలు బ్యాంకు శాఖల వద్ద కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఒప్పందం ప్రకారం.. ప్రాంతం ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, నగదు నిర్వహణ సేవలు అందించడం, రోజువారీ నిర్వహణ, ఏటీఎంలలో ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడం లాంటివి ఔట్ సోర్సింగ్ సంస్థల బాధ్యత. ప్రస్తుతం ఎస్బీఐ ఏర్పాటు చేయబోతున్న కొత్త ఏటీఎంల కోసం రూ.200 కోట్లు పెట్టుబడిగా పెట్టబోతోంది సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి