కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో గగ్గోలు  పెట్టాయి. కొత్త వ్యవసాయ బిల్లుల కారణంగా రైతులకు అన్యాయం జరుగుతుంది అంటూ ఎన్నో విమర్శలు కూడా గుప్పించాయి. అయితే విమర్శల మధ్య కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుని.. ఇక అటు వెంటనే ఆ వ్యవసాయ బిల్లులను చట్టాలుగా మార్చింది అన్న విషయం తెలిసిందే.  ఇలా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.



 ఎందుకంటే వేల సంఖ్యలో రైతులు ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులను నిర్బంధించి రోజుల తరబడి నిరసనలు ఆందోళనలు ఉద్యమాలు చేపట్టడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.  ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



 ఈ క్రమంలోనే రిపబ్లిక్ దినోత్సవం నాడు రాజ్ పాథ్ లో  రైతు సంఘాలు భారీ ర్యాలీ తల పెట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ భారీ ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి.  తాము తలపెట్టిన భారీ ర్యాలీ లో ఎలాంటి మార్పు లేదని రైతు సంఘాలకు చెందిన నేత రాకేష్ ఇటీవల స్పష్టం చేశారు. ర్యాలీ  ఆపాలి అంటు  తమకు  ఎలాంటి నోటీసు రాలేదని ఒక వేళ కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలు చేస్తున్న ర్యాలీని ఆపాలని ప్రయత్నిస్తే పదివేల మంది  రైతుల మరణం తథ్యం  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ ర్యాలీ జరిగితే వేల సంఖ్యలో రైతులు మరణించడం ఖాయం అంటూ కేంద్ర ప్రభుత్వం  చెప్పడం దారుణం అంటూ రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: