నేటి రోజుల్లో యువతలో ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి బెంగా కనిపిస్తోంది. అయితే జండర్ ప్రకారం చూస్తే బట్ట తల లో రెండు రకాలు ఉంటాయి.. ఒకటి పురుషుల్లో వచ్చే బట్టతల దీన్నే మెయిల్ ప్యాట్రన్ హెయిర్ లాస్ అంటారు.. ఇక రెండవది మహిళల్లో వచ్చే బట్టతల దీనినే ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్ లాస్ అంటారు. సాధారణంగా మగ వారిలో యుక్త వయసు రాగానే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇదే బట్టతల రావడానికి కారణం అని ఒక అపోహ కూడా ఉంది. కానీ పరిశోధనల ప్రకారం మాత్రం టెస్టోస్టిరాన్ బట్టతలకు కారణం కాదు అన్నది తెలుస్తోంది.
అయితే పురుషుల్లో బట్టతల నుదురు నుంచి వెంట్రుకలు వెనక్కి పోతూ ఉంటే మహిళల్లో.. మాడు ప్రాంతంలో జుట్టు పల్చబడటం జరుగుతూ వుంటుంది. అయితే బట్టతల నిర్ధారణకు ముందుగా డెర్మో స్కోపి లేదా ట్రైక్రోస్కోపీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఒక వేళ వీటితో ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్‌ఫ్రారెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలు కూడా ఉపకరిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి