ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హిందూ ఆలయాల లో విగ్రహం ధ్వంసం సంచలనం గా మారి పోయినది అన్న విషయం తెలిసిందే. కేవలం ఏపీ లోనే కాదు దేశ వ్యాప్తం గా కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హిందూ ఆలయా లలో జరుగుతున్న దాడులు అంశాలు చర్చనీయాంశం గా మారి పోయాయి. ఈ క్రమం లోనే అటు జగన్ ప్రభుత్వం కుట్రపూరితం గానే హిందూ ఆలయాలపై దాడులు చేయిస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 అయితే ప్రతిపక్ష పార్టీలు కావాలనే కుట్రపూరితంగా ఇలా వ్యవహరిస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అంటూ అటు అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు ఏపీలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులు మాత్రం వివాదాస్పదంగా మారి పోయాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్... విపక్షాలు కుట్రపూరితంగానే ఈ పనిచేస్తున్నాయి. అంటూ వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  మరింత చర్చనీయాంశంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్లోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ యాక్షన్ చేస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను విపక్షాలకు అంట కట్టాలని గౌతమ్ సవాంగ్ చూడటం  దారుణం అన్నారు చంద్రబాబు నాయుడు. అన్ని మతాలు ప్రచారాలు, బలవంతపు మతమార్పిడులు ఎవరు చేస్తున్నారో  అందరూ గుర్తించాలి అంటు  కోరారు. తిరుపతి లో జరగబోయే ఉప ఎన్నికల్లో  వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి అంటూ కోరారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: