ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో పరిణామాలు రోజురోజుకీ మారిపోతున్నాయి అనే విషయం తెలిసిందే.  నిషేధిత ప్రాంతం లోకి వచ్చి కూడా గుడారాలు ఏర్పాటు చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న చైనా సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గత కొన్ని నెలల క్రితం తెరమీదకి వచ్చిన  వివాదం ఇప్పటికి కూడా సద్దుమణగలేదు. సరిహద్దు వివాదం అంతకంతకు ముదురుతు  ఏ క్షణంలో చైనా భారత్ మధ్య యుద్ధం జరుగుతుందో అనే  విధంగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే చైనా సైనికులు సరిహద్దుల్లో ఎప్పుడు తోక జాడింపు  చర్యలకు పాల్పడుతున్నారు అనే విషయం తెలిసిందే.



అయితే ఎప్పుడు భారత సైనికులను భయపెట్టడానికి లేదా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చైనా సైన్యం. ఈ క్రమంలోనే గతంలో ఏకంగా గుడారాలను తీసివేయాలని చెప్పడానికి వెళ్లిన భారత సైనికుల పై దాడి చేసి ప్రాణాలు తీశారు. దీంతో కోపంతో ఊగిపోయిన భారత సైన్యం ఒక్కసారిగా మీద పడి వందల మంది చైనా సైనికుల ప్రాణాలు తీశారు. అయినా  చైనా సైన్యానికి మాత్రం బుద్ధి రాలేదు. కుక్క తోక వంకర అనే విధంగా సరిహద్దులో చైనా సైన్యం వ్యవహరిస్తుంది.  ఏదో ఒక విధంగా భారత సైన్యాన్ని రెచ్చగొట్టే విధంగా ఇప్పటికి ఎన్నో డబుల్ గేమ్స్ ఆడుతూనే ఉంది చైనా. అయినప్పటికీ భారత సైనికులు మాత్రం ఎంతో సహనంతోనే ఉన్నారు.



 ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధం అనే స్టేట్మెంట్ ఇవ్వడం మరింత సంచలనం గా మారిపోయింది. అయితే ఇప్పటికే సరిహద్దుల్లో భారత్ ఏ  క్షణంలో యుద్ధం తలెత్తిన చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఎన్నో రకాల క్షిపణులను యుద్ధ విమానాలను  మోహరించి సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఆర్మీ చీఫ్ నరవానే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిపోయాయి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని భారత సైనికుల సహనాన్ని పరీక్షిస్తే.. తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఆర్మీ చీఫ్ నరవానే  వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం గా మారింది. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: