ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా మారి పోయాయి అన్న విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం లో.. పశ్చిమ బెంగాల్ లోని అన్ని పార్టీలు కూడా అప్రమత్త మయ్యాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మార బోతున్నాయి అని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో అంతగా సత్తా చాటని బిజెపి.. ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.



 ఈ క్రమం లోనే బిజెపి గత కొంతకాలం నుంచి ఎంతో వ్యూహాత్మకం గా ముందుకు వెళ్తుంది అన్న విషయం తెలిసిందే . తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జెండా ఎగురవేయాలని బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో అటు మమతా బెనర్జీకి మద్దతు అంతకంతకు  పెరిగిపోతుండటం కూడా ప్రస్తుతం పశ్చిమబెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయింది.


 ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇక బీజేపీ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాకుండా ప్రస్తుతం దీనిపై ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ కి అంతర్గత గ్రూపులు  ఇబ్బందికరంగా మారుతుంది అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు సీఎం అభ్యర్థులను అంటూ ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టిన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సీఎం అవుతారు అంటూ ఆ పార్టీ నేత సౌమిత్ర ఖాన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే దీనిపై టీఎంసీ నుంచి బీజేపీ లోకి వచ్చిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: