ఒకప్పుడు ఆడపిల్లలను భారంగా భావించేవారు.. ఆడపిల్ల పుట్టింది అంటే చాలు.. రోడ్లపై వదిలేయడం చెట్ల పొదల్లో పడేయడం లాంటి ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కాని ప్రస్తుతం కాలం మారింది. మనుషుల ఆలోచనా తీరులో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఆడపిల్ల భారం అనుకున్న  వారే ఇప్పుడు ఆడపిల్ల పుడితే  ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది అని ఎంతో సంబరపడిపోతున్నారు. అంతే కాదు ఎంతో మంది అబ్బాయిలు కావాలి అని కోరుకునే వారి కంటే అమ్మాయి కావాలి అని కోరుకునే వారు ఎక్కువవుతున్నారు.



 కానీ ఈ మధ్య కాలంలో ఆడ పిల్లలు కావాలి అనుకున్న ఎంతో మంది తల్లిదండ్రులకు ఆడ పిల్లలు కాకుండా అబ్బాయిలు పుడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు.   కాగా ఇక్కడ  దంపతులకు నలుగురు కొడుకులు పుట్టడంతో ఇక ఆడపిల్ల లేదు అని భావించిన ఆ  కుటుంబం..  తమ ఇంట్లో ఉన్న ఆవుని ఆడబిడ్డ గా భావించి శ్రీమంతం నిర్వహించింది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.



 ఆ ఇంట్లో ఉన్న ఆవే ఆ దంపతులకు ఆడబిడ్డ గా మారిపోయింది.  హనుమకొండ ఎస్బిహెచ్ కాలనీ లో పిజే ఆర్ అపార్ట్మెంట్ లో  వీరేశం,శోభ దంపతులు నివసిస్తున్నారు.  అయితే వీరికి నలుగురు కొడుకులు ఉన్నారు.  నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ ఆడపిల్ల లేదు అనేబాధ మాత్రం వీరికి ఉండిపోయింది.  అయితే నెల రోజుల క్రితమే రెండో కొడుకు శ్రవణ్ అంగట్లో ఒక ఆవును కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే ఇక కూతురు లేని తమకు ఆ అవే కూతురిగా భావించారు ఆ దంపతులు. ఇటీవలే ఆవు గర్భం దాల్చిందని తెలియడంతో ఆవుని కూతురు గా భావించి ఘనంగా గోమాతకు శ్రీమంతం చేయించారు. హిందూ  సాంప్రదాయం ప్రకారం శ్రీమంతం జరిపించడం తో వారి గొప్ప మనసు పై అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: