ప్రముఖ భజన గాయకుడు నరేంద్ర చంచల్  ఇకలేరు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం  అయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేంద్ర చంచల్ దాదాపు మూడు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పుడు అయన చికిత్స పొందుతూ మరణించారు. నరేంద్ర చంచల్‌ను భజన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కేవలం భజన పాటలే.. కాదు సినిమా పాటలను కూడా నరేంద్ర చంచల్ ఆలపించారు. నరేంద్ర చంచల్ భజన పాటలకు ఉత్తరాదిన ఎంతో క్రేజ్ ఉంది....

నరేంద్ర చంచల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రధాని ట్వీట్ చేశారు. తనదైన గాత్రంతో పాటల ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు... అయన  మృతిపై ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహిందీ కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇక దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా నరేంద్ర చంచల్‌కు నివాళులు అర్పించారు. అదే విధంగా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ నరేంద్ర చంచల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆయనను స్మరించుకుంటూ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించింది.

కాగా, నరేంద్ర చంచల్ స్వస్థల పంజాబ్‌లోని అమృత్‌సర్.  వారిది ఆధ్యాత్మిక కుటుంబం కావడం వల్ల చిన్నప్పటి నుంచే నరేంద్ర చంచల్ భజన పాటలు పాడే వారు. 1973లో వచ్చిన బాబీ మూవీలో 'బేషక్ మందిర్ మసీద్' పాటను నరేంద్ర చంచల్ పాడగా . ఆ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం ..




మరింత సమాచారం తెలుసుకోండి: