అయితే ఇప్పటికే కుటుంబ పాలన అంటూ అటు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. ఇక ఇప్పుడు కేటిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో మరింత తీవ్రస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే త్వరలో కేటిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అన్న ప్రచారం తెలంగాణ రాజకీయాలను ఊపేస్తున్న నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా కేసీఆర్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న హామీ నిలబెట్టుకోవాలి అంటూ సూచించారు.
ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అంటూ మాట ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ ఇప్పుడైనా తప్పులను సరిదిద్దుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సరికొత్త డిమాండ్ను రేవంత్ రెడ్డి తెరమీదికి తెచ్చారు. కేటీఆర్ సమర్ధత ఏంటో కేవలం కేసీఆర్ కు మాత్రమే తెలుసు అని అందుకే ఆయన కేటీఆర్ ను సీఎం చేయరు అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. కేవలం మంత్రి పదవులు కావాలని ఆశ పడుతున్న వారే ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటూ కోరుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి