ఓ వైపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా వైసీపీ మీద దూకుడుగా వెళుతున్న అచ్చెన్న...జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అటు ఎంపీగా ఉన్న రామ్మోహన్ సైతం...తన పార్లమెంట్ పరిధిల్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని లేపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో పలాస స్థానాన్ని బాబాయ్-అబ్బాయ్‌లు స్పెషల్‌గా పట్టించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన సీదిరి అప్పలరాజు హవా ఎక్కువగా ఉంది.
తొలిసారి పలాస నుంచి గెలిచిన అప్పలరాజు, చంద్రబాబు, టీడీపీ నేతలపై ఒంటికాలి మీద వెళ్తారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు పరువు ఎలా తీశారో కూడా తెలిసిందే. అందుకే బాబు పరువు తీసిన అప్పలరాజుపై బాబాయ్-అబ్బాయ్‌లు పగబట్టేశారు. ఎప్పటినుంచో అప్పలరాజుని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అయితే మధ్యలో అప్పలరాజు మంత్రి అయిపోయారు. దీంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. పలాస నియోజకవర్గంలో ఈయన చెప్పిందే వేదం అన్నట్లు అయింది.
ఇక అప్పలరాజు ఆధిక్యాన్ని తగ్గించడానికి బాబాయ్-అబ్బాయ్‌లు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య సర్ధార్ గౌతు లచ్చనపై అప్పరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. అక్కడ నుంచి అచ్చెన్న-రామ్మోహన్‌లు అప్పలరాజుపై విరుచుకుపడుతున్నారు. అటు అప్పలరాజుపై ఓడిపోయిన గౌతు శిరీష సైతం దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు. అన్నీ కోణాల్లో అప్పలరాజుని వీక్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళుతున్నారు. రామ్మోహన్ అయితే పలాసలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. పలు అంశాల్లో అప్పలరాజుపై పోరాటం చేస్తున్నారు. ఎలాగైనా అప్పలరాజుని వీక్ చేసి స్థానిక పోరులో సత్తా చాటాలని చూస్తున్నారు. మొత్తానికైతే బాబాయ్-అబ్బాయ్‌లు అప్పలరాజుపై పగబట్టేసి, వైసీపీకి చెక్ పెట్టేయాలని చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి