బోధన్ పాస్ పోర్ట్ స్కామ్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసామని సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ వివరించారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఆరుగురిని అరెస్టు చేసామని తెలిపారు. నలుగురు బంగ్లాదేశ్ తో పాటుగా ఇద్దరూ బోధన్ కు చెందిన వారితో పాటు పోలీసులు అరెస్టు అయ్యారని తెలిపారు. తప్పుడు పత్రాలు పెట్టి పాస్ పోర్ట్ లను తీసుకున్నారు అని పేర్కొన్నారు. ఓకే ఇంటిపై 70కి పైగా పాస్ పోర్ట్ జారీ అయ్యాయి  అని వివరించారు. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పాస్ పోర్ట్ లు జారీ అయినట్టుగా గుర్తించాం అన్నారు.

 పాస్ పోర్ట్  జారి లో పోలీసుల పాత్ర పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.  ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు అని పేర్కొన్నారు.  నలుగురు బంగ్లాదేశ్ కూడా అరెస్టు చేశాం అని వివరించారు.  తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులు పాస్ పోర్ట్ తీసుకున్నారు  అని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాస్ పోర్ట్ లు  గుర్తించాం అన్నారు.  పాస్ పోర్ట్ సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింకు బయటపడింది అన్నారు.

 నిజామాబాద్ బోధన్ లో ఇంకా ఎవరెవరు పాస్ పోర్ట్ లు తీసుకున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నాం అని వివరించారు.  తప్పుడు పత్రాలతో పాస్ పోర్ట్ తీసుకున్న వారు బయటికి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.  ఇప్పటికే కొన్ని ఎల్ ఓ సి లు  కూడా జారీ చేశాం అన్నారు.  పాస్ పోర్ట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది అన్నారు. బోదాన్ పాస్ పోర్ట్ కేసులో విచారణ వేగవంతం చేశామని, స్పెషల్ టీం ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నాము అని వివరించారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పచ్ఛిమబెంగాల్ , ఒకరు ఏజంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశాం అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: