తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాను అంటూ..కొత్త రాజకీయ పార్టీ పెట్టేలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన వైఎస్ షర్మిల ఆ దిశగా ముందుకు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నూతన  పార్టీ పై ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్దఎత్తున చర్చలు నడుస్తున్నాయి. వైయస్ షర్మిల స్థాపించ బోతున్న కొత్త పార్టీ పేరు ఏమిటి..?.. పార్టీ సభ్యులు ఎవరు.? వారి అజెండా ఏమిటి..? అంటూ ప్రశ్నలు కోకొల్లలుగా తలెత్తుతున్న వేళ ఓ తాజా వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ వైసీపీ నాయకుడు... ప్రస్తుతం షర్మిల వెనక నడుస్తున్నారు. ఇక్కడ ఇతర పార్టీల నుండి షర్మిల పార్టీలోకి ఎవరు రాబోతున్నారు అనే అంశంపై షర్మిల పార్టీ ఖాతాలోకి తొలి బోణి పడిందని చెప్పవచ్చు. తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ పార్టీకి ఆకర్షితుడై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఒకళ్ళు రాజీనామా చేశారు.

టిఆర్ఎస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా.. గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ కు సంబంధించినటువంటి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేఎస్ దయానంద్ అలియాస్ డేవిడ్... ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజీనామా లేఖను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ కి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి కి ఇప్పటికే పంపినట్లు ప్రకటించారు. అనంతరం ఆయన అనుచరులతో కలసి త్వరలో పార్టీ పెట్టనున్న వైయస్ షర్మిల తో... లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. అంతేకాక షర్మిలకు మద్దతుగా ప్రకటించినట్లు తెలిపారు.

షర్మిల కు మద్దతు పలికిన వాళ్ళల్లో మాజీ కార్పొరేటర్ శ్రీలత ఆమె భర్త మహాత్మ రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షుడు పంబాల రాజేష్,, డివిజన్ ప్రధాన కార్యదర్శి  ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా నిన్ననే బండి సంజయ్ షర్మిల పార్టీని హల్లేలూయా పార్టీ అంటూ  సంబోధిస్తూ చెప్పుకొచ్చారు. అంటే ముస్లిం వైపు నుంచి ఓవైసీ ని అదేవిధంగా క్రైస్తవుల వైపు నుంచి షర్మిల ముందు పెడుతున్నారు. అయితే షర్మిల మాత్రం ఏ పార్టీ లతోనూ అదే విధంగా ఎటువంటి మతపరమైనటువంటి అనుబంధాలు నాకు లేవు అని చెబుతోంది. కానీ క్యాటగరీ చూస్తుంటే మాత్రం రిలీజియస్ పరంగా  ఎన్నుకుని మరీ పార్టీలో చేరుతున్నట్లు కనిపిస్తుంది అంటూ పలు విమర్శలు వినపడుతున్నాయి. మరి ముందు ముందు ఏమేమి జరుగుతాయో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: