దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తీరుపై ఇప్పుడు ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. ఇప్పటివరకు మద్దతు ఇచ్చిన హిందూ సంఘాలు కూడా భారతీయ జనతా పార్టీ విషయంలో కాస్త సానుకూలంగా ఉన్నా సరే ఇక ముందు మాత్రం అలా ఉండకపోవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలను ఇబ్బంది పెట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఏమో గానీ ఇప్పుడు ధరల పెంపు దెబ్బకు సామాన్య ప్రజలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై  మండి పడుతున్నారు అని చెప్పాలి.

రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సామాన్య ప్రజలు తినడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి అనే మాట వాస్తవం. దేశంలో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది అని అంటున్నారు. ఇప్పటికే భారీగా అప్పులు చేసి భారీగా వడ్డీలు  కడుతుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఆర్థిక నిపుణులు కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలను పెంచడం ద్వారా కొనుగోలు శక్తి పడిపోతుందని భవిష్యత్తులో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని ఇప్పటికే ఆదాయ మార్గాలు తగ్గి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అంటున్నారు.

ఇలాంటి తరుణంలో ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే ఆలోచించి ఇలా పన్నులు పెంచడం ద్వారా అనేక సమస్యలు ఉంటాయి అని మండిపడుతున్నారు. ధరలను తగ్గించే అంశంపై దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా ఇబ్బంది పడుతుంది. ధరల విషయంలో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నిరసనలు చేయగలిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: