ప్రస్తుతం ఏపిలో అధికార పార్టీ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..ఇక వీరి అడుగు జాడల్లోనే టీడీపీ శ్రేణులు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ మేరకు ఈరోజు కుప్పం కీలక నేతలతో బాబు ఈరోజు మీటింగ్ ను ఏర్పాటు చేశారు. అయితే బాబు బస చేసిన గెస్ట్ హౌస్ లో రాత్రి పవర్ కట్ అయ్యింది. ఈ విషయం పై ఇప్పటికే టీడీపీ శ్రేణులు రక రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. బాబు పర్యటనను ఆదుకోవడానికి వైసీపీ ఇలాంటి నీచానికీ పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు .


తాజాగా ఈ విషయం పై మరో టీడీపీ నేత స్పందించారు. జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనిపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి విద్యుత్ సరఫరా నిపివేయడం దారుణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ' గెస్ట్ హౌస్‌కు కావాలనే కరెంట్ కట్ చేశారు. కనీసం జనరేటర్, బ్యాటరీ కూడా ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో మేము కూడా షాకులిస్తాం. కచ్చితంగా భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ' అని జగన్ సర్కార్ పై అమర్నాథరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.


జిల్లాలో చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. చంద్రబాబు బస చేసిన ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్దకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించనున్నారు. గురువారం నాడు కుప్పం పర్యటనలో మొత్తం పార్టీ కార్యకర్తలు హోరెత్తారు. భారీ జెండాలు పట్టుకుని, ద్విచక్ర వాహనాలపై రోడ్‌ షో పొడవునా బారులు తీరి పయనించారు. జై చంద్రబాబు.. జై తెలుగుదేశం అనే నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు.. డ్యాన్సులు చేస్తూ తిరునాళ్ళ సందడి వాతావరణాన్ని సృష్టించారు.చంద్రబాబు కాన్వాయ్‌ వెంట ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా వాహనాల శ్రేణి కనిపించింది. బాబు పర్యటన మొత్తం పసుపు సంద్రం పరవళ్లు తొక్కింది.బాబుకు ఆ జిల్లాల్లోని కీలక నేతలు ఘన స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: