ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ డెలివరీ వ్యవస్థ ప్రారంభం కానుంది. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని ఇకనుంచి గడప గడపకు రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇందులో భాగంగా  9, 260 మొబైల్ డెలివరీ యూనిట్ వాహనాలు ప్రారంభించారు. అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధం అయ్యాయి.  లబ్ధిదారులకు నాణ్యమైన మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్ద అందజేసేందుకు యేటా 830 కోట్ల అదనంగా వెచ్చిస్తూ  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రూపొందించారు.



అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేయడానికి వీలు లేదంటూ ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ ఆదేశాలిచ్చారు. ఎందుకంటే రేషన్‌ పంపిణీ చేసే వాహనాలకు వైసీపీ కలర్స్‌ ఉండడంతో ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. కమిషనర్‌‌ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఎంక్వైరీ జరుగగా.నేడు ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఏపీలో వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో పాజిటివ్‌ తీర్పువచ్చింది.


దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది. ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక సంస్థలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది.


విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.ఏపీలో స్ధానిక సంస్థలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: