అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శ‌ని ఉంద‌న్న సామెత‌.. గుంటూరు టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అదేస‌మ‌యంలో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ దూకుడుగా ఉన్నారు., ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి ఉద్య‌మం విష‌యం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇన్ని అనుకూల‌త‌లు.. ఉన్న‌ప్పుడు స‌హ‌జంగానే గుంటూరు కార్పొరేష‌న్‌లో టీడీపీకి విజ‌యం ద‌క్కి తీరుతుంద ని ఎవ‌రైనా అనుకుంటారు.అంతేకాదు.. పార్టీ అదినేత చంద్ర‌బాబు అయితే.. త‌మ ఖాతాలో ప‌డే కార్పొరేష‌న్ల జాబితాలో తొలి పేరును గుంటూరుగానే పేర్కొన్నారు.

అయితే.. ఇప్పుడున్న అంచ‌నాల మేర‌కు, వ‌స్తున్న విశ్లేష‌ణ‌ల‌ను బ‌ట్టి.. గుంటూరులో టీడీపీ విజ‌యం సాధించి తీరుతుందా? అనేది కీల‌కంగా మారింది. ఎందుకంటే.. పార్టీకి ఊపు ఉంది. కానీ.. స‌రైన పంథాలో నడిపించే నాయ‌కులు క‌రువ‌య్యారు. ఎంపీ గ‌ల్లాకు దూరంగా చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అదేస‌మ‌యంలో తెనాలిలో బాధ్య‌త‌ల‌ను ఆల‌పాటి రాజా చూస్తుండ‌డంతో ఆయ‌న ఎక్కువ స‌మ‌యం గుంటూరుకు కేటాయించ‌లేక పోతున్నారు. ఇక‌, జిల్లాలో ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌కు ఎంపీ వ‌ర్గానికి మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

తాజాగా ఎంపీ పాల్గొన్న ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు వారు దూరంగా ఉన్నారు. ఇక‌, రాయ‌పాటి వ‌ర్గంగా ఉన్న కొంద‌రు కూడా ఎంపీ గ‌ల్లాకు దూరంగా ఉన్నారు. ఇక‌, వెస్ట్‌లో టీడీపీ జెండా ఎగ‌రితే.. త‌న‌కు ఎక్క‌డ జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు త‌గ్గుతాయోన‌ని భ‌య‌పడుతున్న జంపింగ్ ఎమ్మెల్యే మ‌ద్దా లి గిరి.. టీడీపీ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంటున్నారు. వారు ఏం కోరితే అది చేస్తాన‌ని చెబుతున్నారు.

ఇక‌, అసంతృప్తుల‌ను బాబు బుజ్జ‌గించ‌క‌పోగా.. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్న బెదిరింపు ధోర‌ణితో మాట్లాడా ర‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా.. కార‌ణాలు అనేకం.. గుంటూరు టీడీపీని భ్ర‌ష్టు ప‌ట్టించాయి. మ‌రోవైపు వైసీపీ నాయ‌కులు మూకుమ్మ‌డిగా ఇక్క‌డ పాగా వేస్తున్నారు. కీల‌క నేత‌లు సైతం .. ఎక్కువ మందే.. వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో అనుకున్న విధంగా గుంటూరు టీడీపీ ఖాతాలోకి చేరే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: