రాజకీయాలలో విజయాన్ని దక్కించుకోవాలంటే ఎత్తుకు పై ఎత్తులు వేయడం చాలా ముఖ్యం. రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో ముందుండాలి. అప్పుడే ప్రత్యర్థిని గెలవడానికి సులభంగా ఉంటుంది. అయితే ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను మనము సినిమాలలో చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం వాస్తవ రాజకీయాలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్.  ఈయనను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడానికి మన దేశంలోని వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అర్ధం చేసుకోండి ఈయనకు రాజకీయ వ్యూహకర్తగా ఎంత డిమాండ్ ఉందో.

అంతెందుకు 2019 లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ గెలవడంతో ప్రముఖ భూమిక పోషించింది పీకే నే, జగన్ ఇతని పై నమ్మకంతో ఎన్నికల ముందు ఇతనిని కలిశాడు. అనుకున్నట్లే అపర మేధావి, మోస్ట్ సీనియర్, 40  సంవత్సరాల సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాడు జగన్. ఈ విజయమంతా పీకే రాజకీయ వ్యూహాలలో భాగమే. ఏపీలో పీకే రాక ముందు బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయ్యారు. తరువాత పంజాబ్ లో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు లో డీఎంకే గెలవబోతోంది అంటున్నారు కాబట్టి సక్సెస్ రేటు పెరుగుతోంది. దీనితో ఇప్పుడు పీకే కి డిమాండ్ మాములుగా లేదు. అంతే కాకుండా పీకే టీం లో పనిచేసిన వారు బయటకు వెళ్లిన తరువాత వారికి కూడా భారీగానే డిమాండ్ ఉంది.

ఉదాహరణకు ఏపీలో టీడీపీ రాబిన్ శర్మ సేవలను వాడుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తో కలిసి పని చేయమని పిలుస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈయనను ఉపయోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. బెంగాల్ లోని అన్ని సర్వేలు ఈసారి మమతా గెలవదని నొక్కి చెబుతున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా ఎదురు నిలబడి అన్ని రాజకీయ కోణాల నుండి కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బూతు స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ కూడా పని చేయనున్నారని తెలుస్తోంది. మరి ఏమి జరుగుందో చూడాలి. ఈయన ఇలా చేసినందుకు గానూ 400 నుండి 500 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: