ఫ్యాన్ గాలి రూరల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో వీచింది. ఆ సీన్ అలా ముగియగానే ఇపుడు మునిసిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. మరి పట్నం ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది పెద్ద ప్రశ్న. అయితే మరో వారంలో పోలింగ్ ఉందనగానే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా మొత్తం పొలిటికల్ సినేరియాలో మార్పు కనిపిస్తోంది.

విశాఖ జిల్లా ఎలమంచిలి టీడీపీకి చాలా బాగా  పట్టున్న ప్రాంతం. టీడీపీ పెట్టాక అక్కడ నుంచి కాంగ్రెస్ గెలవడానికి రెండు దశాబ్దాలు పట్టిందంటేనే పసుపు పార్టీకి ఎంత స్ట్రాంగ్ బేస్ ఉందో అర్ధమవుతుంది. ఇక ఇప్పటికి తొమ్మిది సార్లు యలమంచిలి ఎన్నికలు జరిగితే ఇప్పటికి ఆరుసార్లు టీడీపీ గెలిచి సత్తా చాటింది. ఇక నియోకవర్గ కేంద్రం అయిన యలమంచిలిలో ఎపుడు టీడీపీ జెండావే రేపరెపలాడుతూంటుంది.

ఈ నేపధ్యంలో 2013లో మునిసిపాలిటీగా మారిన యలమంచిలిలో ఎన్నికలు జరిగితే టీడీపీ విజయ బావుటా ఎగరేసింది. ఇక తాజా ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. ఎలమంచిలిలో నామినేషన్ల ఉపసంహరణ నాటికి మూడు కౌన్సిలర్ సీట్లు ఏకగ్రీవమై  వైసీపీ ఖాతాలో పడ్డాయి. వైసీపీ దీంతో సమరోత్సాహంతో ముందుకు అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మునిసిపాలిటీ పీఠం తమదేనని కూడా గట్టిగా ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ జోరుతో టీడీపీ ఇక్కడ బేజారవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు వ్యక్తిగత ప్రతిష్టగా ఇక్కడ ఎన్నికలను తీసుకున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా అసలు వదలకూడదని ఆయన గట్టిగానే పట్టు బిగిస్తున్నారు. మరో వైపు టీడీపీకి క్యాడర్ ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది. దాంతో ఇక్కడ రాతలు మారే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు.  మరి పోలింగ్ నాటికి ఇదే రకమైన పరిస్థితి ఉంటే మాత్రం ఇక్కడ వీసీపీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అన్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: