ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడి ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్దగా దృష్టి పెట్టలేక పోయింది అంటే మాత్రం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సంస్థాగతంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసిపికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టలేదు.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దానిపై ఒక నివేదికను కూడా ముఖ్యమంత్రి జగన్ కు ఇచ్చే ప్రయత్నం చేయటంలేదు. మంత్రులు కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు భవనాల శాఖ ఉందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి ప్రభావం చూపించలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే అంటున్నారు.

రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రోడ్ల నిర్మాణం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రోడ్ల నిర్మాణం విషయంలో సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రోడ్ల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్దమవుతుంది. రాష్ట్ర ప్రజల మీద అనేక విధాలుగా పన్నులు వేసి ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో ఎందుకు దృష్టి పెట్టలేక పోతున్నది అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు పడతారని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఉద్యమాన్ని ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: