సాధారణంగా షాపింగ్ ఎక్కువగా ఇష్టపడేది పురుషులా  మహిళలా  అని సర్వే నిర్వహిస్తే అన్ని సర్వేల్లో కూడా మహిళలే అన్న విషయం బయట పడుతుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మగవారు అయితే అవసరం ఉన్న సమయంలోనే షాపింగ్ చేయడం ఆ తర్వాత ఊరుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మహిళలకు మాత్రం షాపింగ్ అంటే ఎదో తెలియని ఉత్సాహం. అందుకే ఏదైనా షాపింగ్మాల్ కనిపించింది అంటే చాలు ఇక అవసరం లేకపోయినప్పటికీ షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తమకు అవసరమైన వస్తువులు కాదు అవసరం లేని వస్తువులు కూడా కొనడానికి ఆసక్తి చూపుతుంటారు.



 అందుకే మహిళలకు షాపింగ్ పిచ్చి ఎక్కువగా ఉంటుందని పలు సినిమాల్లో కూడా ఇప్పటికే చూపించిఅందరిని  నవ్వించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక షాపింగ్ చేయడానికి మహిళలను  మరింత ఆకర్షించేందుకుఅటు  షాపింగ్ మాల్స్ కూడా ఎన్నో రకాల ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే తెర మీదికి వచ్చి అందరినీ ఆకర్షిస్తున్న ఆఫర్ కాస్త  మహిళలను మరింతగా ఆకర్షిస్తోంది. సాధారణంగా మహిళలు ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే ఇక ఆ వస్తువు కొనేందుకు డబ్బులు లేకపోతే... ఈఎమ్ఐ  రూపంలో వస్తువు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే.



 అలాంటిది ఇప్పుడు కొనండి తర్వాత డబ్బులు కట్టండి అని ఆఫర్ పెడితే ఊరుకుంటారా ఇక తెగ షాపింగ్ చేసేస్తున్నారు ఇటీవల ఇలాంటి ఒక ఆఫర్ కూడా తెర  మీదికి వచ్చి అందరినీ ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆఫర్ కు ఎక్కువగా మహిళలే ఎట్రాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. బై  నౌ  పే  లేటర్  అనే ఆఫర్ కి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని జస్ట్ మనీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇలా ఈ ఆఫర్ కి అట్రాక్ట్ అవుతున్న మహిళల్లో  26 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు అన్నది ఈ సర్వే చెబుతోంది.  ఏదేమైనా షాపింగ్ చేయాలి అంటే ఎవరైనా మహిళలు తర్వాతే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: