ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికల వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా కూడా వైసీపీ వాళ్లు టీఆర్ఎస్‌కు అనధి కారికంగా మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడ వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. ఇది కేసీఆర్‌కు మైనస్సే అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే సాగర్లో అమరవీరుల కుటుంబాలకు చెందిన 400 మంది నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ అమరువీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రు. 10 లక్షల ప్రభుత్వ సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల ప్రభుత్వ భూమి ఇస్తానన్న హామీ ఇచ్చి.. దానిని నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు భారీ ఎత్తున పోటీలో ఉంటే నిజామాబాద్ ఎంపీ సీటు ఫలితం రిపీట్ అవుతుందా ? అన్న ఆందోళన కూడా గులాబీ పార్టీలో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి