అయితే ప్రస్తుతం కొన్ని పెద్ద దేశాలు ఆర్థిక సంక్షోభం లో కూరుకు పోయినప్పటికీ క్రమ క్రమంగా సంక్షోభం నుంచి బయట పడుతూ ఉంటే చిన్న దేశాలు మాత్రం రోజు రోజుకు మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. దీంతో కనీసం నిత్యవసర వస్తువు కొనుగోలు చేయాలి అన్న కూడా భారీగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న వెనిజులాలో కేవలం ఒక టీ తాగడానికి ఒక సంచి నిండా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదే ఆర్థిక సంక్షోభం మరో చిన్న దేశానికి కూడా పాకిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం లెబనాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. లెబనాన్లో ఇటీవలే ఒక రొట్టె రేటును ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఆ రేటును చూసి ప్రస్తుతం ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఏకంగా 960 గ్రాముల ఒక రొట్టె ఖరీదు మూడు వేల రూపాయలుగా నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. అయితే కిందటేడాదితో పోల్చుకుంటే ఒక రొట్టె రేటు ప్రస్తుతం డబుల్ అయింది అని అక్కడి మీడియా చెబుతుంది. దీన్నిబట్టే ప్రస్తుతం లెబనాన్ ఎంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అన్నది అర్థం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి