తెలంగాణలో సినీ నటులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతున్నది. వాళ్ళను దగ్గర చేసుకోవడానికి సీఎం కేసీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నారు.. అయితే కొన్ని కొన్ని పరిస్థితులు అనుకున్న విధంగా కనబడకపోవడం తో సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో సినిమా షూటింగులకు ఎక్కువగా అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.

కొన్ని ప్రాంతాలలో పర్యాటక రంగం బలంగానే ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సినిమా షూటింగులను నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి త్వరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ఆరు జిల్లాల్లో సినిమా షూటింగులకు అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ లను ప్రోత్సహించడానికి కొన్ని రాయితీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది.

కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి త్వరలోనే సీఎం కేసీఆర్ తో కొంతమంది సినీ పెద్దలు సమావేశమయ్యే అవకాశాలున్నాయని వారి వారి అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ తీసుకునే అవకాశం ఉండవచ్చని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం చేసే విషయంలో సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వాళ్ళతో మాట్లాడి కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మరి ఏ ప్రచార కార్యక్రమాలను తెలంగాణలో సినీ సినీ పరిశ్రమ చేస్తుంది అనేది చూడాలి. ప్రముఖ హీరోలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం చేసే అవకాశం కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: