ఈ దేశాలు పాకిస్థాన్ ని పక్కన పెట్టేసి భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలతో కలిసి కంబాట్ నోవెల్ గేమ్స్ లో పాల్గొనేందుకు దుబాయ్ మరియు సౌదీ అరేబియా ముందుకొచ్చింది. అంతే కాకుండా ఈ వార్ గేమ్ జరగబోతోంది పెర్షియన్ గల్ఫ్ లో, అయితే ఇది పాకిస్థాన్ వారిని ఎంతగానో అవమానించే అంశమని చెప్పవచ్చు. పాకిస్థాన్ ఇప్పటి వరకు సౌదీ అరేబియా మరియు దుబాయ్ లో లభ్యమయ్యే ఆయిల్ మరియు బంగారాన్ని తక్కువ ధరకే కొనుక్కుని, ఆ బంగారాన్ని భారత్ కు స్మగుల్ చేసుకుని, దాని ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. దుబాయిలో మాములుగా బంగారానికి అసలు టాక్స్ ఉండదు. అందుకే మన దేశానికి దుబాయ్ కి బంగారు ధరలో కొంత వ్యత్యాసం ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచం పాకిస్థాన్ పై కొన్ని ఆంక్షలు విధించడంతో దుబాయ్ మరియు సౌదీ అరేబియా దేశాలు వీరి వెంట ఉండడానికి సుముఖ చూపడం లేదు. అంతే కాకుండా పాకిస్థాన్ అంటే ఇటు భారత్ కి గానీ అటు ఫ్రాన్స్స్ దేశానికి గానీ పాడనీ విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలకు దుబాయ్ మరియు సౌదీ అరేబియా దేశాలు దగ్గరగా ఉండడంతో పాకిస్థాన్ ఆ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతోంది. మరి ఈ విషయంలో పాకిస్థాన్ ఏమి చేయనుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి