మొన్నటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో అన్ని పరిశ్రమలు ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి కోలుకుంటున్నాయి. ఇక అలాంటి సమయంలో మరోసారి కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడం ఊహించిన దానికంటే ఎక్కువ కేసులు నమోదు కావడంతో మళ్లీ కొన్ని రకాల పరిశ్రమలు సంక్షోభంలో కూరుకు పోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసిన పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం కూడా నష్టాల బాటలోకి వెళ్తున్నట్టు  ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. మొన్నటి వరకు చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఏకంగా 300 రూపాయల వరకు చేరింది చికెన్ ధర..దీంతో సామాన్య ప్రజలు అందరూ ఆందోళన చెందారు.



 కానీ ఆ తర్వాత మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది చికెన్ ధర. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చికెన్ ధరలు మారిపోయాయి. కానీ ప్రస్తుతం చికెన్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. చూస్తూ చూస్తుండగానే చికెన్ ధరలు పడి పోతూ ఉండడంతో అటు పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారులు అందరూ తలలు పట్టుకుంటున్నారు. కరోనా దెబ్బకు బ్రాయిలర్ కోడి ధరలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. చికెన్ ధరలు రోజు రోజుకి తగ్గిపోతు ఉన్నాయి. ఓవైపు డిమాండ్ తగ్గిపోవడం పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి నిలిచిపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది.



 మొన్నటివరకు ఏకంగా 270 రూపాయల వరకూ పలికిన చికెన్ ధర ప్రస్తుతం 170 రూపాయలు తగ్గింది.  కరోనా వైరస్ సమయంలో ఫంక్షన్లు ఏవి చేయకపోవడం.. కఠిన ఆంక్షలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో చికెన్ తీసుకోవడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా కరోనా వైరస్ ముందు జాగ్రత్త లో భాగంగా చికెన్ వైపే చూడటం లేదు చాలామంది. అయితే  వైరస్ ప్రభావం ఎక్కువగా కాకముందు ఏకంగా తొమ్మిది లక్షల క్వింటాల్లా చికెన్ అమ్ముడుపోతే ఇక  వైరస్ ప్రభావం తర్వాత కేవలం ఐదు లక్షల క్వింటాళ్ల చికెన్ మాత్రమే అమ్ముడు పోయింది. అయితే ఓ వైపు బ్రాయిలర్ కోడి ధరలు నేలచూపులు చూస్తూ ఉంటే  నాటుకోడి మటన్ ధరలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: