గత ఏడాది కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలులోకి రావడంతో కనీస ఉపాధి కరువై సామాన్య ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో ఉండే సామాన్య ప్రజలు..  వైరస్ కారణంగా అన్ని రకాల పనులు నిలిచి పోవడంతో చివరికి ఎలాంటి పనులు దొరకగా ఉపాధిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాయి. ఉచితంగానే రేషన్ సరుకులు అందజేశాయి అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు కరోనా వైరస్ కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు అందరూ మరోసారి ఆందోళన చెందుతున్నారు.  ఇక కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలాగే పెరిగిపోతే తమ పరిస్థితి ఏంటి అని భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇక ఎన్నో రకాల పనులు నిలిచి పోతున్నాయి. దీంతో మళ్లీ సాధారణ ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు.


 కరోనా వైరస్ కేసులు దృష్ట్యా ఎంతో మందికి సరైన పనులు లేక కనీసం ఉపాధి కరువై మళ్ళీ పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం చొప్పున అందిస్తోంది. వీటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు అందించేందుకు సిద్ధమైంది ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: