ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కరోన నియంత్రణ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అని ఆయన మండిపడ్డారు. పారాసిట్మాల్, బ్లీచింగ్ తో కరోన పోతుందని సీఎం మాట్లాడి.. నాన్ సీరియస్ గా తీసుకున్నారు అని ఆయన మండిపడ్డారు.

ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా..కరోన తో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి అనడం దారుణం అని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా విషయంలో దేశంలోనే ఏపి 5 వ స్థానం లో ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గ్లోబల్ టెండర్లను  మా ఒత్తిడితో నే పిలిచారు అని అన్నారు. జగన్...అబద్దాల ముఖ్యమంత్రి..కరోనా మరణాలు పై అబద్ధాలు ఆడుతున్నారు అని ఆయన విమర్శించారు.  వెంటిలేటర్లు బెడ్స్ కావాలని పీఎంకు జగన్ లేఖ రాయాలి అని డిమాండ్ చేసారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు కులం అపాదించడం దారుణం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వడం లేదు...వైసీపీ నేతలకు,కార్యకర్తలకు ఇస్తున్నారు అని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణాకు అంబులెన్సులు పంపించడం చేతకాని సీఎం జగన్ అని మండిపడ్డారు. సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాను అని ఆరోగ్యశ్రీ లో ఎంత మందికి వైద్యం అందించారో శ్వేతపత్రం ప్రకటించాలిఅని ఆయన డిమాండ్ చేసారు. విజయ సాయిరెడ్డి ఈ రోజు 300 బెడ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు..ఆయనకు ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని నిలదీశారు. కరోనా మీద ఎవరైనా మాట్లాడితే.. కేసులు,అరెస్టులు అని అమరావతి కొనసాగిస్తే..కొత్తగాఆసుపత్రిలు వచ్చేవి..బెడ్స్ కొరత వచ్చేది కాదు అని అన్నారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సు కేసీఆర్ అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను అని ఆయన అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా 10 వ తరగతి పరీక్షలు రద్దు చేయాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: