తెలంగాణలో కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా వెళ్లడం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేంద్ర విషయంలో సీఎం కేసీఆర్ తప్పు చేశారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాజేంద్రను పిలిచి మాట్లాడి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రను రాజకీయంగా వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా రెడీ అవుతుంది. వరుసగా ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

మాజీ మంత్రి కొండా సురేఖ, రాజ్యసభ ఎంపీ శ్రీనివాస్ అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి తో కూడా త్వరలోనే ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఏంటి అనేది ఆసక్తిని రేపుతోన్న అంశంగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈటెల రాజేందర్ కారణంగా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్  లో చాలా వరకు పరిస్థితులు ఇప్పుడు కాస్త ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. ప్రతిపక్షాలు బలపడుతున్న నేపథ్యంలో ఈటెల రాజెంద్ర విషయంలో సీఎం కేసీఆర్ అనవసరంగా తొందర పడ్డారని తెలంగాణలో వైఎస్ షర్మిల కూడా ఈటెల రాజెంద్ర వ్యవహారాన్ని వాడుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఈటెల రాజేందర్ కు సంబంధించి కేసీఆర్ ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: